Monday, September 29, 2008

టమాటా నువ్వు; టమాటా నేను

ఇంతక ముందు టపాలో రాసిన టమాటా కూర ని "బేర్బోన్స్" టమాట కూర అనుకుందాం.

ఇప్పుడు ఇంతక ముందు చెప్పినట్టు, టమాటా - వంకాయ, టమాటా - చిక్కుడుకాయ, టమాటా - గుడ్డు, టమాటా - బంగాళాదుంప, టమాటా - నేను, టమాటా - నువ్వు ఇలా ఎలా చెయ్యాలో చూద్దాం.
(టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్ -
2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, మిరగాయలు 4( నీకు దమ్మున్నన్ని), 4 వెల్లుల్లి రేకులు,చిటెకెనవేల్లో పావంత అల్లం, కొత్తిమీర కొంచెం, తిరగమాత లేక పోపు పెట్టె వస్తువులు.
ఉల్లిపాయలు తరుగు, పక్కనబెట్టు
మిరగాయలు తరుగు, పక్కనబెట్టు
వెల్లుల్లి రెక్కలు తీస్కో బొటనవేల్తో ఘాట్టిగా నొక్కు, పైన పొట్టుతీ, పక్కనబెట్టు,
అల్లం పైన తొక్కతీ, సన్నని ముక్కలుగా తరుగు, ఎంత సన్నవి? 1 యం.యం * 1 యం.యం. ఇందాకటి వెల్లుల్లి రెక్కలు, ఈ అల్లం ముక్కలు రెంటినీ కలిపేసి చిప్పగంటెతో బాగా నూరు - అల్లం వెల్లుల్లి పేస్టు తాయారు, మీరు తాయారా. టమాటాలు ఓసారి కడిగి, సన్నగా తరుక్కో.
)
(టొమాటో కూర చేసే విధానం టెంప్లేట్-
భాండి దీస్కో, పొయ్యి మీదపెట్టూ, మంట మధ్యంతరంగా ఉంచు.
3-4 చెంచాలు నూనె పొయ్యి. వేడెక్కినాక పోపు పెట్టు. పోపు చిటపట్లాడినాక పసుపు వెయ్, వెంటనే తరుక్కున మిరగాయలు వెయ్, కొంచెం వేయించు, వేగాక తరుక్కున్న ఉల్లిపాయలు వెయ్, అవి కొంచెం రంగు మారంగనే అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్..కొంచెం తిప్పు. )
(ముగింపు టెంప్లేట్ -3 నింషాలు ఆగి మూత తీయ్,నీళ్ళు సరిపడా ఉన్నాయోలేదో చూడు. లేకపోతే కొంచెం ఓ అరగ్లాసు నీళ్ళుపొయి. ఉప్పు, కావాల్సినంత కారం వేయ్. మూతపెట్టు. ఈలోపల, కొత్తిమీర కడుగు, సన్నగా తరుక్కొ. 3 నింషాల తర్వాత మూత తీయ్, కొత్తిమీర దాంట్లో కుమ్ము. ఓసారి అంతా కలుపు. నీళ్ళు ఇంకిపోతున్నాయ్ అనిపిస్తే ఆపేయ్ పొయ్యి. మూత పెట్టి అట్టా ఉంచు కొసేపు.
)
1. టమాటా - మర్చిపొయ్యానండోయ్... మునక్కాయ:
వహ్..వాహ్..స్స్కహ్..
కావాల్సినవి: టమాటా కూరకి కాల్సినవన్ని, మరియూ మునక్కాయలు..లేతవి..నవనవలాడుతున్నవి....
పద్ధతి:
టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్+
మున్నక్కాయల్ని కడుగు. ఎన్ని? రెండో మూడో..దొరికినదాన్ని బట్టి, కూర రుచిగా వస్తే మళ్ళి మళ్ళి తినాలనిపించందనుకో రెండు పక్కనబెట్టుకుంటే మంచిదికదా..అప్పుడప్పుడు నవ్వుతుండు, కొంపలేమి మునగ-వ్.
మునక్కాయని కోసే పద్ధతి:
కాయని తీస్కో, ఒక్కో తరుక్కి రెండు రెండు విత్తనాలొచ్చేలా తరుక్కో. రబ్బరుట్యూబ్ ని కోస్తున్నట్టు అనుకొ. ఐతే కొన్ని ముదిరిన మునక్కాయలు కూడా వస్తాయి. మనం మునక్కాయలశాస్త్రమ్లో నిష్ణాతులం కాదుకదా. అలా ముదిరినవి ఒక పట్టాన తెగవు. పర్లేదు. పానిక్ కాకు. ఎక్కడదాకా తెగిందో అక్కడ్నుంచి లాగేసేయ్ చెరుకుగడ పైన గట్టిని లాగేసినట్టు.
ఇప్పుడు టమాటా కూర చేసే విధానం టెంప్లేట్ +అయ్యాక, టమాటాలు కుమ్ముతావ్కదా, ఆటితోపాటు మునక్కాయలు కూడా కుమ్ము. ఐతే కొంచెం నీళ్ళు పొయ్. లేకపోతే మునక్కాయలు ఉడకవ్. ముగింపు టెంప్లేట్ ని ఇంప్లిమెంటు చెయ్. ముక్క కొంచెం చిట్లింది అనిపించాక ఇంకో 5నిమిషాలు ఉంచి దింపేసి, ఆరగించు.
కీ: లేత మునక్కాయ. కోసేప్పూడు, ఒకవైపు ఓపెన్ ఉంటే మునక్కాయ తొందరగా ఉడుకుతుంది. ఎలా? కోసేప్పుడు చివరకంటా కొయ్యకుండ కొంచెం ఉంచుకున్నావనుకో పీకేసేయొచ్చు.

#2. టమాటా గుడ్డు (గుద్దు కాదు - టమాటా ని గుద్దితే చిట్లిపోతుంది):
దీన్ని రకరకాలుగా చేస్కోవచ్చు. టమాటాపగలొగగొట్టిన గుడ్డు, టమాటా బాయిల్డ్ గుడ్డు, టమాటా స్లైసెద్ బాయిల్డ్ గుడ్డు ఇలా...:)
టమాటా ఉడ్కబెట్టిన గుడ్డుకూర ఎలా?
టమాటా కూర కావాల్సిన వస్తువుల టెంప్లేట్ + దనియా పొడి + గుడ్లు. ఎన్ని? సరిపోయినన్ని!!
గుడ్లని ముందుగా ఉడకబెట్టండి. ఎలా ఉడకబెట్టాలి? ఒక గిన్నె తీస్కుని, గుడ్లని (ఒక 5 అడుగుల ఎత్తునుండి దాన్లో వేసి) దాన్లో పెట్టి, గుడ్లు మునిగేదాకా నీళ్ళు పోసి, మంట కొంచెం ఎక్కువలో పెట్టి, అటువెళ్ళి చాయ్ లాగించి దమ్ముకొట్టొచ్చి, రాంగనే నీళ్ళున్నాయోలేదోజూస్కుని "(అట్టా సూత్తా సాయంత్రానికి "హబ్బ) ఉడికినై" అనుకున్నాక, గిన్నెగిన్నెని చల్లనీళ్ళకిందబెట్టి, ఒక్కోగుడ్డు "పగ్ల" కొట్టి, పెంకుతీసేసి పక్కనబెట్టుకోండి.
టొమాటో కూర చేసే విధానం టెంప్లేట్ + తరుక్కున్న టమాటాలు వెయ్, అలానే, ఉడికించిన గుడ్లు, ఒక్కోటి తీస్కో, ఒక చిన్న గాటు పెట్టు, వెయ్, తీస్కో గాటు వెయ్ ఇంకోటి తీస్కో గాటూ వెయ్.. గేందివయా ఎంతసేప్జెప్తవ్..ఛల్..ముంద్కెళ్ళెవానే...గట్లనే..అన్నీ గుడ్లు వెయ్..ధనియా పొడి వెయ్. నీళ్ళు సర్పోనున్నయోలేదోజూడి. మూతపెట్టుడి.
ముగింపు టెంప్లేట్ ఫాలో గాండ్రి..
ఘుమ ఘుమలాడే టమాటా కోడి గుడ్డుకూర రెడీ....

4 comments:

teresa said...

గీ టెంప్లేటేంది భయ్..నా సామాన్లో గాజు ప్లేటుండే, స్టీలు ప్లేటుండే, పింగాణి ప్లేటుండే,సిలవరు చట్టీ, మట్టి ముంత గూడా ఉండే... ఇయ్యన్ని వదిలి మళ్ళి టెంప్లేటేదో గొనాలా ఇప్పుడు?

Bhãskar Rãmarãju said...

హుం....కొంచెం టెక్నికల్గా కవరింగిచ్చా...:):)

సిరిసిరిమువ్వ said...

మీరైదైనా టి.వి.చానల్లో వంటల ప్రోగ్రాంకి చెఫ్‌గా ట్రై చేయకూడదూ!!

కీ: లేత మునక్కాయ. కోసేప్పూడు, ఒకవైపు ఓపెన్ ఉంటే మునక్కాయ తొందరగా ఉడుకుతుంది. ఎలా? కోసేప్పుడు చివరకంటా కొయ్యకుండ కొంచెం ఉంచుకున్నావనుకో పీకేసేయొచ్చు.... ఈ కీ ఎందో సమజవ్వలేదు భయ్.

Bhãskar Rãmarãju said...

@సిరిసిరిమువ్వ గారు: నేను సరిగ్గా ఎక్సుప్రెసు చెయ్యలేకపోయా. ఆలోచించి సరిదిద్దుతా.