ఇదో కమ్మని పచ్చడి. ఈ పచ్చడి చెయ్యటానికి తపనిసరిగా మిక్సీ లేక రోలు ఉండాలి.
కావాల్సిన పదార్ధాలు: మినుములు లేక మినప్పప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి.
మినుములు లేక మినప్పప్పు: ఎలాంటివి? పొట్టు మినప్పప్పు అంటారు. అవీ!!
ముందుగా, మినప్పప్పుని వేయించి పక్కనబెట్టుకోవాలి. ఎలా? భాండీ పెట్టి, భాండీ వేడయ్యాక మినప్పప్పు వేసి వేపటమే.
From వంట |
అయ్యాక, ఒక అరగ్లాసు నీళ్లలో ఓ పెద్ద గోలీ అంత చింతపండు నానబెట్టుకో. అలా అది నానుతూ ఉండనీ.
ఇప్పుడు, మళ్లీ భాండీ పెట్టు, ఓ రెండు చెంచాలు నూనె పొయ్యి. వేడి అయ్యాక, ఓ పావు గుప్పెడు "జీల్కర", ఓ ఎనిమిది మెంతులు వెయ్యి నూనెలో, వేగంగనే ఓ 10/15 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి, వేపు, అయ్యాక ఓ సిబ్బిరేకులో పోస్కో, లేకపోతే ఆ కోరుతో భయపడి మీ చుట్టుపక్కనోళ్లు అగ్నిమాపక యంత్రాన్ని పిలుస్తారు.
From వంట |
ఇందాక చింతపండు నానబెట్టుకున్నావుగా, దాన్ని బాగా చెయ్యిపెట్టి పిసికి, చింతపండు పిప్పి తీసేయ్యి.
ఇప్పుడు, ఈ ఎండుమిరపగాయలు, మిన్పప్పప్పు, చింతపండు గుజ్జు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బింగు వెయ్యి. అయ్యాక ఓ చెంచాడు ఉప్పువేసి మళ్లీ రుబ్బింగు వెయ్యి.
From వంట |
రుబ్బింగు వెయ్యగా వచ్చిన పచ్చడినే మినపప్పు పచ్చడి అంటారు. ఇక లాగించు.
అదీ కధ
7 comments:
అవును చింతపండు రసాన్ని కూడా నూనెలో వేయించాలి కదా.
అవును అదేంటి మినప్పప్పు కన్నా మిరపకాయలు ఎక్కువ వున్నాయి? ఎంత కారం గా వుండి వుంటుందో తలచుకుంటే ఇప్పుడే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
@అరుణ గారు: చింతపండు రసాన్నికూడా నూనెలో వేయించాలా? ఏమో!! ఈ సారి అట్టాచేసిచూద్దాం ఎట్టా ఉంటుందో!!
Thanks for the comment
ఇది ఎన్నాళ్ళు నిలవ ఉండును? ఇందులో ఎన్ని కేలరీలు ఉండును? లాంటి సమాచారం కూడా ఇవ్వాలేమో..
కొ.మా. పేరు పెట్టి ఏమీ రాయలేదు???
వెరైటీ వంటకమా. :)
భాస్కరా! ఇదేమైనా న్యాయమా?
ఇంకా మావిడి కాయలు రాలేదు, పోనీ మీరు చెప్పినట్లు మార్కెట్లో తెచుచుకుంటే అవి పుల్లగాలేవు. మరెలా నాకిప్పుడు కొ.మా కావాలి. నోట్లో నీళ్ళూరుతున్నాయి. సరే ఎం చేస్తాం. నాన్నను తోటకు తరుముతాను.
సిబ్బి రేకు, ఈ మాట విని ఎన్ని రోజులయ్యిందో. మా నానమ్మ వాడేది. ofcourse ఇప్పుదు ఆవిడ కూడా plate అనే అంటోందిలెండి. మీ recipeలు సూపర్!!
@శృతి గారు: కలికాలం, ఈరేజు రేపట్లో మావిడికాయలకి సీజనంటూలేదు. ఆనదించండి.:)
@రాణి గారు : ధన్యవాదాలు
Post a Comment