Monday, February 16, 2009

కొ.మా (కొబ్బరి - మా...)

అర్ధం అయిపోయిందేం!! ఇట్టే పట్టేసావన్నమాట.
నాకు అత్యంత ఇష్టమైన, చాల రుచికరమైన, చాలా అది అయిన, చాలా ఇది అయిన పచ్చడి - కొబ్బరి పచ్చడి. అందునా సింతపండు బదులు మామిడికాయ వేసిజేస్తే, అహాహా, ఓహోహో!!
రుచి చూడ తరమా,
ఈ పచ్చడి రుచి చూడ త ర మా ఆ ఆ ఆ
రుచి చూడ తరమా!!!!
కావాల్సిందల్లా మంచి కొబ్బరిచిప్ప ఒహటి, పుల్లని మామిడి ఒహటి. ఎక్కడ ఉంటుంది మామిడికాయ?
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి
ఒక కాయ పచ్చనిది ఇంకోటి ఎర్రనిది
పచ్చనిదేమో పుల్లనిదీ
ఎర్రనిదేమో తీయ్యనదీ
గున్నమామిడి చెట్టుమీద కాయలు రెండున్నాయి

సరే, పుణ్యం పురుషార్ధం, గుడికెళ్లి దర్శనం గట్రా సేసేకుని ఓ కొబ్బరికాయకొట్టి ఓ సిప్పతెచ్చుకో. పక్కనోళ్లని అడుగు ఇంకో సిప్పకోసం. సరే. తెచ్చుకున్నావా?
మార్కెట్టుకెళ్లి, ఏటి, మార్కేట్టుకెళ్లి ఓ మాంచి మావిడికాయ, ఏటి, మాంఛి ఆకుపచ్చరంగులోది, అట్టానే ఓ కట్ట కొత్తిమీర, ఓ అరడజను పచ్చిమిరపకాయలు పట్రా (అరడజను మిర్చీ కుమ్ము గురూ అని అడిగావనుకో - ఏటీ కొత్తా అంటాడు - ఓ వందగ్రావుల్తెచ్చుకో)
ఆ మట్టన్ కొట్టు మస్తాన్ కత్తి ఉందిగా, దాంతో కొబ్బరిసిప్పని ఇరగ్గొట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కో కొబ్బరిని. ఓ నాలుగు ముక్కలూ, ఓ బెల్లం గడ్డ నోట్టో కుమ్ముకో, ఏంపర్లేదు. కొబ్బరి సాలకపోతే మన గుడి ఉండనే ఉందిగా. పూజారికి కన్నుకొట్టి, ఓ నవ్వేస్కో సిప్పసేతిలో పెట్టేస్తాడు. ఏంపర్లేదు.

అయ్యాక, మావిడికాయని సన్నటి ముక్కలుగా కోసేస్కో. ఓ నాలుగు ముక్కలు, పులుపుజూట్టానికి నోట్టో ఏస్కో, లేక ఉప్పుకారం అద్దుకుని రుచి చూడు. కాయ అయిపోయిందా, ఇంకోటి తెచ్చుకో. ఏటిసేత్తాం, కలికాలం, రుసిసూట్టానికే ఓ కాయ అయిపోతే ఎలారా రాంసోవి.(శ్రీవారి శోభనం సినిమాలో హీరోవిన్ను బామ్మ గుర్తుకొచ్చింది. పెళ్లి చూపులకి గారెలు చేస్తుంది ఆమె. పెళ్లివాళ్లు వస్తారు. గారెలు పట్రా అంటాడు పెళ్లికూతురి తండ్రి. వంటగదిలోకెళ్లేసరికీ గారెల గిన్నెలో ఒకే గారె ఉంటుంది. ఇదేందిదీ అంటే, రుచి చూద్దామని నోట్టో ఏస్కున్నా, ఇట్టే కరిగిపొయ్యినయ్యి అని ఆమె సిగ్గుపడుతూ చెప్తుంది - జంధ్యాలకి ఓ సారి జై)
ఇప్పుడు, ఓ అరడజను పచ్చి మిర్చీ, ఓ అరడజను ఎండుమిర్చీ, ఓ నాలుగు మెంతులు, ఓ నాలుగు జీలకర్రలు పక్కనెట్టుకుని, భాండీ ఎట్టి, సెంచాడు నూనెబోసి, ఏడి కాంగనే ఆ జీలకర్రలు, మెంతులూ ఎండుమిర్చీ ఏసి, సిటపటలాడంగనే పచ్చిమిర్చీ ఏసేసి ఏయించు. పక్కనెట్టుకో.
ఇప్పుడు ఆ కొబ్బరి ముక్కల్ని మావిడికాయ ముక్కల్ని రుబ్బింగు వేయబడునులో వెయ్యి. రుబ్బింగు కాంగనే, నీక్కావాల్సినంత ఉప్పు ఏస్కుని, ఈ ఏపిన మిర్చి గట్రా దాంట్లో ఏసి, మళ్లీ ఓ పాలి రుబ్బింగు వెయ్యి. బాగామెదిగిందాకా రుబ్బింగు ఏసేస్కుని, అయ్యాక, భాఘా ఇంగువదట్టించి తిరగమాత వేసి, శుభ్రంగా నాయనా, శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కున్న కొత్తిమీర తగిలించి లాగించునాయనా..

ఆ పాతరోజులు: ఒకానొక కాలంలో కొబ్బరి తురమటానికి ఓ ప్రత్యేక పరికరం ఉండేది. దాని పేరే కొబ్బరి తురుం. దానికో పీట, పైన ఓ ఇరుసు, ఓ వైపు ఓ ఎళ్ మార్కు తిప్పేది, ఇటువైపు పళ్ల గుత్తి. చిప్పని ఆ గుత్తికెపెట్టి ఇటు ఎల్ మార్కుని తిప్పుతుంటే ఆ పళ్ళు కొబ్బరిని తురుముతై. అసలు సంగతేంటాంటే ఆ తురుముతో వచ్చిన రుచి. మేబీ, ఆ కొబ్బరి పాలు తురుముతోబాటే ఉండటామో మరేదో. ఆ తురుము అప్పటికప్పుడు ఓ చెంచాడు పందారతో లాగిస్తే - నోరూరుతోంది, వెళ్లి ఓ లోటా నీళ్లు గొంతులోపోస్కొస్తా!!!

8 comments:

మురళి said...

గుమ్మంలో గున్నమావిడి చెట్టు పిందేలేసింది..అవి కాయలయ్యేలోగా మామిడికాయ్-పప్పు కూడా చెప్పెశారంటే..రెండూ ఒకే రోజు పెట్టేస్కోవచ్చు.. మా కోనసీమలో బాగా ఫేమస్ ఈ పచ్చడి.. మీ కొబ్బరి తురుం ని మేము 'కోరం' అనేవాళ్ళం. ఇంట్లో వంట పని ఎక్కువగా ఉన్నరోజున కొబ్బరి కోరే పని ఇంటాయనదే..కారం మాత్రం గుంటూరు రేంజ్ లోనే చెప్పారు..మొత్తానికి నోరూరించారు.

భాస్కర్ రామరాజు said...

ఈ పోష్టుని మళ్లీ ప్రచురించా!! పొద్దున, దీని యూఆరెల్ పనిచెయ్యలా.
మురళీ: అది నా లిష్టులో ఉంది...

శ్రీనివాస్ పప్పు said...

ఈ తొక్కలో మీక్సీలొచ్చి దీని రుచి కాస్తా చెడ దొబ్బాయి కానీ,ఆ రుబు రోల్లో వేసి అమ్మ కొబ్బరికాయ మామిడి కాయ పచ్చడి రుబ్బుతూ విశ్వరూపం(పక్షులలోకెల్ల నేనూ కిరిటీ...గండభేరుండమ్ము నేను కిరిటీ,వృక్షాల లోకెల్ల నేను కిరిటీ..అశ్వద్ధవృక్షమ్ము నేను కిరీటీ,మాసాలలోకెల్ల నేను కిరిటీ మార్గశిర మాసమ్ము నేను కిరిటీ)చదువుతూ ఉంటే వెనకాలే మనం కూడా నేను కిరిటీ అంటూ వంత పాడుతూ కొంచ కొంచం రుచి చూస్తూ అబ్బో బ్రహ్మాండం...పచ్చడి కలుపుకుని అందులో పచ్చడి నంచుకుని,కంచం కింద దాచేసి మళ్ళీ మారు వేయించుకుని...
సూపర్ బాచి బాబూ అదరగొట్టావ్...
మురళీ... మామిడి కాయ పప్పు...ఎం.పీ. లో కె.ఎం.పీ. సూపర్ కాంబినేషన్

శ్రీనివాస్ పప్పు said...

ఈ తొక్కలో మీక్సీలొచ్చి దీని రుచి కాస్తా చెడ దొబ్బాయి కానీ,ఆ రుబు రోల్లో వేసి అమ్మ కొబ్బరికాయ మామిడి కాయ పచ్చడి రుబ్బుతూ విశ్వరూపం(పక్షులలోకెల్ల నేనూ కిరిటీ...గండభేరుండమ్ము నేను కిరిటీ,వృక్షాల లోకెల్ల నేను కిరిటీ..అశ్వద్ధవృక్షమ్ము నేను కిరీటీ,మాసాలలోకెల్ల నేను కిరిటీ మార్గశిర మాసమ్ము నేను కిరిటీ)చదువుతూ ఉంటే వెనకాలే మనం కూడా నేను కిరిటీ అంటూ వంత పాడుతూ కొంచ కొంచం రుచి చూస్తూ అబ్బో బ్రహ్మాండం...పచ్చడి కలుపుకుని అందులో పచ్చడి నంచుకుని,కంచం కింద దాచేసి మళ్ళీ మారు వేయించుకుని...
సూపర్ బాచి బాబూ అదరగొట్టావ్...
మురళీ... మామిడి కాయ పప్పు...ఎం.పీ. లో కె.ఎం.పీ. సూపర్ కాంబినేషన్

Aruna said...

"పూజారికి కన్నుకొట్టి, ఓ నవ్వేస్కో సిప్పసేతిలో పెట్టేస్తాడు. ఏంపర్లేదు."

సరి రారు మీకెవ్వరూ. :)

ఓ అరడజను పచ్చి మిర్చీ, ఓ అరడజను ఎండుమిర్చీ నా...వామ్మో... గుంటూరు కా(ఖా)రాలు అని మా నాన్నగారు చెప్తుంటే ఏమో అనుకున్నా. మీ వంటలు ఫాలో అయినా కారాలు మాత్రం ఫాలో కాలేను.

భాస్కర్ రామరాజు said...

teresa గారు: క్షమించండి. మీ వ్యాఖ్యని ప్రచురించబోయి "రెజెక్టు" నొక్కాను. మా సూరిగాడు డెస్క్టాపు వాడుతున్నాడు, నేని ఐఫోన్ లో మెయిల్ చెక్ చేస్తున్నా, కళ్లజోడుపెట్తుకోలా అం.....
తెరెసా గారు ఇలా అన్నారు:
బావుంది :)
గుడ్నించి తెచ్చుకున్న అరచిప్పా బెల్లం ముక్కతో కలిపి 4 సార్లు నోట్లో ఎగరేసే సరికి అయిపోతూ పచ్చడి చెయ్యడమే కుదరట్లేదు. వచ్చే వీకెండు మెన్యూ లో ఇదే పచ్చడని డిసైడైపోయా!

భాస్కర్ రామరాజు said...

పప్పూ యార్, మురళీ, అరుణ మరియూ తెరెసా గార్లు: కామెంటేసినందుకు ధన్యవాదాలు. అట్టానే ఓ పాలి మీరుకూడా రోలు మా తల్లికి ఓ దండవెట్టుకోండి. అట్టానే జంధ్యాలకీ ఓ పాలి జై కొట్టండీ.
ఓ పాలి కొబ్బరి సెట్టుకీ, మావిడి సెట్టుకీ సలాం పెట్టుకుందాం.

Sravya said...

బావుంది :)