Thursday, March 12, 2009

తాజా వంట! తాజా వంట!! తాజా వంట!!!

ఇదెంటిది, తాజావార్త లా తాజా వంటా అనుకుంటున్నారా?
ఔనండీ! తాజా వంటే. నిన్న ఇంటికెళ్లంగనే మా ఆవిడ గోబి, ఉల్స్, మిర్చ్స్ అన్నీ ముందేసుకుని తరగటానికి "ఉద్యుక్తురాలు" అవుతోంది. ఠడా! వెంటనే మనం రంగంలోకి దూకామ్, "నువ్వు తప్పుకో" అనేసి, కత్తి సుత్తీ అన్నీలాగేస్కుని, గుంజేస్కుని, నరికెయ్యడం మొదలుపెట్టాం.

గియ్యాల గేంద్వయ్యా దావత్ అంటే - గోబీ టమాటా కూర. దీన్ తండ్రి తీ, తీ కలం తీ, కాయితం తీ, రాయి ఏమ్గావాల్నో సప్పుడుజెయ్యకుండా -
ఫూల్ గోబీ - క్యాలీఫ్లవర్
రెండు టమాటాలు - పండువి. పచ్చితెచ్చుకున్నవనుకో, తిరిగి నన్నే అడుగుతవ్, అన్నా పచ్చివితెచ్చిన్నే ఏంజెయ్యాలే. గప్పుడు, బిడ్డా పచ్చి టమాటాతో పచ్చడి రేపు రాస్తలే అని నీకోశం మళ్లీ రాయాలె ఇంకోపోస్టు.
చెటాకు మిర్చి.
నాల్గు వెల్లుల్లి
రెండుగ్రాములు అల్లం.
ఒక గ్రాము మినుములు.
రెండుగ్రాములు పచ్చిశనగపప్పు.
అయిదు కర్వేపాకులు.
ముఫై ఎనిమిది కొత్తిమీర కాడలు.
ఒక ఎండు మిర్చి.
ఒక గ్రాము ఆవాలు.
రెండు గ్రాములు జిలకర.
15.78 మిల్లీలీటర్ల పల్లీ నూనె.
చిటికెడు పసుపు.
ఎనిమిది గ్రాముల కారం.
ముఫై నాలుగు గ్రాముల ఉప్పు, కూరలోకి, ౨౪.౫ ( ఇరవైనాలుగు.అయిదు) గ్రాములు పువ్వుని ఉడ్కబెట్టటానికి.
ఒక మూకుడు, ఒక చట్టి. మూకుడు చట్టి దొరక్కపోతే, ఓ డేగిషా, ఓ సిబ్బిరేకు సిద్ధం చేస్కో.
ఒక గ్యాస్ పొయ్యి.
ఒక అగ్గిపెట్టె.
ఒక అగ్గిపుల్ల.
ఒక గంటె.
ఒక తలకాయ (అఫ్కోర్స్ నీదే)
ఒక మటన్ కొట్టు మస్తాన్ కత్తి. (గమనిక :- కత్తి లేకపోతే కత్తిపీట వాడకూడాదు. కత్తిపీటకీ ఫూల్గోబీకి పడదు)
ఒక పీట. (పైనవన్నీ నరకటానికి)

ముందుగా -
cauliflower ని తెలుగులో ఏమంటారు? కోసుపువ్వు అంటారు. క్యాబేజ్ ని కోసుగడ్డ అంటారు. టామాటాని మావైపు రామ్ములక్కాయ అంటారు. మిగతాప్రాంతాల్లో ఏమంటారో మరి, తెల్వదీ.

సరే -

ముందుగా -
కోసుపువ్వుని కత్తిపెట్టి, ఒక్కోపువ్వుని తరిగేస్కో.
అయ్యాక, ముందు, మిర్చిని సన్నగా ఛాప్, అదేలేగురు హోజాషురూ, తరుక్కో. తర్వాత, అరచేతినిబెట్టి, వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు (క్రష్), అప్పుడు వాటిపైన తొక్కతీసేసి సన్నగా ఛాప్ చేసి పక్కన్బెట్. అల్లం, పైన తొక్క తోసేసి, సన్నగా తర్క్స్, పక్కన్బెట్స్.
From tomato_cauli


ఇప్పుడు, ఓ డేగిషాలో నీళ్లు తీస్కో, మరగ్గాయి. మరిగాక పసుపువెయ్యి, ఓ ౨౪.౫ (ఇరవైనాలుగు.అయిదు) గ్రాముల ఉప్పు వెయ్యి. ఇప్పుడు పువ్వుని ఆ మరిగే నీళ్లల్లో వేసి, పొయ్యి ఆర్పివెయ్యి. మూతపెట్స్. ఫైవ్ మినిట్స్ అయ్యాక, డ్రెయిన్ వాటర్. అంటే కోశుపువ్వుని వేడినీళ్లలోనుండి వేరుచేసి, పక్కనబెట్టు అని.
From tomato_cauli

ఉల్లిపాయని సన్నగా తరుక్కో, ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)
From tomato_cauli

From tomato_cauli

పొయ్యి వెలిగించు, చట్టి పెట్టు అదే, డేగిషా.
నూనె పొయ్యి. కాగంగనే మినుములు, పచ్చిశనగపప్పు, ఎండు మిర్చి, ఆవాలు, జిలకర, చివరాకరికి కర్వేపాకులు లతో తిరగమాత వేసేయ్. ఓ చెటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు మిర్చి, వెల్లుల్లి వెయ్యి. ఓ సారి బాగా కలుపు. ఇప్పుడు ఉల్స్ వెయ్యి, డీప్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించు.
అయ్యిందా, ఇప్పుడు తరుక్కున్న రాములక్కాయలు వేసేయి. కలుపు లేక గంటే బెట్టి తిప్పు - తిప్పు అంటే త్రిపురసుందరి కాదు, తిప్పు అంటే తిప్పడం. అయ్యాక ఇందాకటి కోశుపువ్వు వేసేయ్, ఉప్పు, కారం వెయ్యి కలియ తిప్పు, మూతెట్టు. గ్రేవీ అంటే నీళ్లు సరిపోను లేవు అనుకుంటే ఓ గళాసు పోస్కో (ఆంటే అవసరాన్ని బట్టి అని)
ఉడకనీ ఇక.
ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు -
From tomato_cauli

(పైన ఫోటోని అలా చూడకు, అదేంటి కూరా లేక సాంబారా అని, పొరపాటున కొంచెం నీళ్లెక్కువైనై)
చివరాకర్న, లాగించటం మర్చిపోకు.

మీ ఇంట అన్నీ శుభకార్యాలకి, కార్యాలు కరామత్తులకీ క్యాటరింగు చెయ్యబడును-
సంప్రదించండి - నల భీమ. ఒకళ్లే వంట చేస్తారు, ఇంకోకళ్లు సోఫాలో కూర్చుని ఐఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు.
From tomato_cauli


కొన్ని మిక్స్డ్ డైలాగులు- నువ్వు సరిగ్గా గమనించావోలేదో (గురుగారు రావ్ గోపాల్ రావ్ గారి స్టైల్ - ఛాలంజ్), మనం వోల్ మొత్తం ఎడంసేతి సంగం పెసినెంటు (మాడా స్టైల్ - ముత్యాలముగ్గు)

19 comments:

సిరిసిరిమువ్వ said...

అటూ ఇటు పిల్లకాయల్ని చూసుకుంటూ రెండు చేతులతో కూరగాయలని తరుగుతూ అబ్బా ఏం అదృష్టమండి మీ ఆవిడది!

teresa said...

ముప్పియ్యెన్మిది కొతిమీర కాడలేడా కనిపీవేంది భాయ్‌?
చెప్పిన తీరుకి మాత్రం నోట్లో నీరూర్తుండే!

madhu said...
This comment has been removed by the author.
madhu said...

ఇందాక చాల పెద్ద వ్యాఖ్య రాసాను ... కొన్ని అప్పు తచ్చులు చూసుకోక తొలగించాను !

మీరు చాల బాగా రాస్తారు రామరాజు గారు ! వంట అస్సలు తెలియని వాళ్ళు కూడా మీ బ్లాగ్ చూసి వంట మొదలెట్టొచ్చు !

ఫోటో పెట్టి కింద, పై ఫోటో అలా చూడకు అంటే భలే నవ్వొచ్చింది ! ఒకరే వంట చేస్తారు, ఇంకోకళ్లు సోఫాలో కూర్చుని ఐఫోన్లో గేమ్స్ ఆడుతుంటారు...లాంటివి బాగా హిట్టు అయ్యాయి !
38 కట్టలు, 25 గ్రాములు , 5 గ్రాములు మినుములు అంటే బ్రదర్స్ కొందరు తూకపు రాయి లేదని బాధ పడతారేమో, ఒక 10-15 మినుములు అలా చెప్పండి ! ;-) హహహ పిల్లాట !
టమాటా - పండువి ...పచ్చివి కాదు ! ఇలా ఇంత కేరింగ్ గా, ప్రతీదీ చెప్తారు గనకే మీ నల భీమ పాకం చాలాఆఆఆ బాగుంటుంది ! మరిన్ని తాజా వంటల కోసం చూస్తుంటాము ! వెల్లుల్లి, ఉల్లి భలే సన్నం గా తరిగారు !
నల భీమ పాకమే అనిపించుకున్నారు ! ఫోటో చూస్తేనే, గోబీ కూర తినాలి అనిపించేట్టు ఉంది !

చెప్పినట్టు, ఉడకబెట్టిన నీళ్ళు పారబోస్తే పోషకాలు అందవు పిల్లలకి మరి ! అందుకే నేను తిరగమాత తర్వాతా, కొంచెం నీళ్ళు పోసి, అందులో టమాటా, గోబీ వేసేసి పైన మూత బెట్టేస్తా ! అప్పుడు ఆ తక్కువ నీరే ఆవిరై కూర ఉడికి పోతుంది ! మధ్యలో కావాలంటే చూసుకుని మరి కొంచెం నీళ్ళు పోయచ్చు !

madhu said...

ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)

ఎందుకు చెప్మా ?

శ్రీనివాస్ పప్పు said...

నేనందుకే ఎప్పుడో సెప్పా ఈ ఎదవ గోలెందుకు తొక్కలో ఆర్ధికమాంద్యం బోషాణం అవీ ఉండవు యేపీ గా ఈ వంటలో కేటరింగో సేసుకుంటూ ఎదవ జీవితం ఎళ్ల దీసేద్దము ఈవూరొచ్చీమంటే ఇని దొబ్బించుకోవు గందా...

జ్యోతి said...

అంతా బానే ఉంది కాని ఒక్కటి కాదు రెండు కాదు ముప్పైయ్యెనిమిది కొత్తిమిర కాడలేవి తమ్మి?? కూరంతా యెతికిని కనపడ్లా?.

మురళి said...

టమాటా ని మా సైడు పుల్లొంకాయ అంటారండీ..(పుల్లని వంకాయ)

సుజాత వేల్పూరి said...

మా వూర్లో గూడా టమాటా పేరు రామ్ములక్కాయే కానీ అసలు దానికాపేరు ఎలా వచ్చింది? రాముడి కీ ఆ పేరుకీ ఏమైనా లింకుందా? ఎవరికైనా తెలుసా?

కాలిఫ్లవర్ ని కోసుపువ్వు అంటారని తెలీదండీ నాకు!

ఈ కూర చపాతీల్లోకి కూడా భలే ఉంటుంది.

ఆ రెండు పేపర్లు.....:))!

ఏమిటో, వరూధిని గారన్నట్లు దేనికైన పెట్టి పుట్టొద్దూ! ఎంత అదృష్టమో!
అది సరే, ఎండాకాలం వచ్చి ఇన్ని రోజులైనా పండు మిరపకాయల పచ్చడి రెసిపీ ఏదండి? మా ఇంట్లో ఒక విడత పెట్టడం, లాగించడం కూడా అయిపోయింది.

Anonymous said...

సుజాత గారూ రాముడికీ టమాటాకీ లింకేంటో తెలియాలంటే గోదారికీ గసి కి సంబంధమేంటో మీరు చెప్పాలి ( గుర్తుందా)
అదిసరే గాని నాన్న గారూ కాలి ఫ్లవర్ తో పాటూ ఆకుపచ్చ ని జీవాలు కూడా ఫ్రీగా వస్తుంటాయ్ మాకు మరి వాటినేం చెయాలో చెప్పలేదు మీరు . అసలే మక్కికి మక్కీ ఫాలో అవుతాను నేను. మాకు తెల్సినావిడ ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది , ఏమనంటే వంటొచ్చిన మగాణ్ణి పెళ్ళి చేసుకోటమంత పొరపాటు లేదు . మనపని మనల్ని చేసుకోనీయరు అన్నిట్లో వేలు పెడతారు ప్రతీ వంటకీ వంకలు పెడతారు అని అమ్మగారు కూడా అలాగే ఫీలవుతున్నారేమో అని నాకు అనుమానం . లేకపోతే ఏంటండీ చేతిలో పని లాక్కుని మరీ ...............

asha said...
This comment has been removed by the author.
Bhãskar Rãmarãju said...

ముందుగా వ్యాఖ్యానించిన అందరికీ వందనాలు.
@సిరిసిరిమువ్వ గారు, సుజాత గారు - పాపం మావిడ. ఎప్పుడో ఓ నీలం చంద్రదినం రోజున వంటింటో అడుగెట్టి వీలెవల్లో ఫోటోబులు గట్రా లాగేస్కుని "నన్ను చూడూ నా వంటని చూడూ" అని రొమ్మిరిచుకుని పోజిచ్చా గాని, రోజూ పిల్లని ఓ చేత్తో, వాడికి వంట్లు నేర్పుతూ ఇంకో చేత్తో, ఓ వైపు దోసెలేస్తూ లేక వంటజేస్తూ, ఉప్పేయడం మర్చిపొయ్యి, అదే అంమృతం లా ఆ దొరికిన మూడు సెకండ్లలో నే నోట్టో కుక్కేస్కుని జీవితానికి - ఇదీ అర్ధం అని చెప్పి నిరూపించే శ్రీమతులకు వందనం, నా శ్రీమతికీ వందనం. తనది అదృష్టమో లేక, ఇద్దరు పిల్లల్తో అమెరికాలో ఎవ్వరూ సహాయం లేకుండా బండి ఆగనీకుండా నెట్టుకొస్తోంది, బాధ్యతో.
దీనిమీద ఓ సీరియస్ పోష్టు రాస్తా.
@తెరెసా గారు, మరియూ జ్యోతి గార్లు - అబ్బే, మీరు సరిగ్గా చదవలేదు, నేనొప్పుకోను -

ఉడికినాక, కొత్తిమీర (పైన్లీ వాష్డ్ అండ్ ఛాప్ప్డ్ - శుభ్రంగా కడిగిన మరియూ సన్నగా తరిగిన) జల్లు -
@శ్రీజీ - యా!! అదీ నిజమే. కానీ, జనరల్గా గోబీలో పురుగులు ఉంటాయ్. పసుపు నీళ్లలో ఉడ్కబెట్టుడు అందుకే. గా పుర్గులు సస్తై అని.
>>ఆ రెండు, పేపర్లని దిబ్బలో కొట్టు, ఊప్స్, స్టడీ, ఆ రెండు రామ్ములక్కాయల్ని ఛాప్ చేస్కో. (ఆ రెండు అనంగనే పేపర్లు అనే స్పురిస్తోంది ఈమధ్య)
ఎందుకు చెప్మా ?
నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే ఒకానొక కాలంలో ప్రత్యేకమైన గౌరవం లేక పోయినా, ఎదో వార్తలు అందిస్తాయి అని చదివేవాణ్ని. ఇప్పుడు, అవి కేవలం యై.యస్.ఆర్ ని ఏకటానికే అన్నట్టు ఉన్నాయ్. సంహౌ, నాకు నచ్చలా. అందుకే.
@పప్పూ యార్ - దానెక్క, వచ్చేస్తన్నా ఆగు. పెట్టేద్దాం. మావోణ్ని మాత్రం గల్లా పెట్టెకాడ బెట్టొద్దు. ఆడు ఆ గేంస్ ఆడతంటాడా, ఎవుడన్నా గల్లా పెట్టె నూక్కబోతడు. :):)
@మురళి - పుల్లొంకాయ్. విచిత్రంగా ఉందే. మొట్టమొదటి సారి ఇంటన్నా..:)
@సుజాత గారు - మాకు మొన్నగూడా మంచుపడింది. :(
@లలిత గారు -
>>మాకు తెల్సినావిడ ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది , ఏమనంటే వంటొచ్చిన మగాణ్ణి పెళ్ళి చేసుకోటమంత పొరపాటు లేదు . మనపని మనల్ని చేసుకోనీయరు అన్నిట్లో వేలు పెడతారు ప్రతీ వంటకీ వంకలు పెడతారు అని అమ్మగారు కూడా అలాగే ఫీలవుతున్నారేమో అని నాకు అనుమానం . లేకపోతే ఏంటండీ చేతిలో పని లాక్కుని మరీ ...............
:):) మడిసన్నాక కూసింత కత్తిపోషణుండాల, లేకుంటే మడిసికీ పీటకీ తేడా ఏటుంటది...:):)
>>అదిసరే గాని నాన్న గారూ కాలి ఫ్లవర్ తో పాటూ ఆకుపచ్చ ని జీవాలు కూడా ఫ్రీగా వస్తుంటాయ్ మాకు మరి వాటినేం చెయాలో చెప్పలేదు మీరు.
లే, సమఝ్గాలే. గేందీ ఆకుపచ్చనిదీ?

కొత్త పాళీ said...

తమ్ముడూ, నీ వంట రుచి్ సంగతేమోగానీ నీ నేరేషన్‌ ష్టైలు మాత్రం ముచ్చటేస్తుంది.
ఓ సారి ఇటు మా వూరొచ్చెయ్యండి. ఆవిళ్ళనిద్దర్నీ మాలుకి తోలేసి, మనిద్దరం ఐరన్‌ షెఫ్ఫు లెవెల్లో కాంపిటీషనెట్టేసుకుందాము.
అద్సరేగానీ, నీ మొదటి కామెంటులో శ్రీమతులకిచ్చిన జోహార్ .. భళా భళా. ఊరుగాని ఊర్లో మొగుడు పన్నెండేసి గంటలు ఉద్యోగాని కతుక్కు పోతే పిల్లల్నీ, ఇంటినీ, సంసారాన్నీ ఈడ్చుకొస్తున్న మన మహిళామణులందరికీ లాల్ సలాం. అమ్మో , ఎమోషనెక్కువైపోయి నారాయణమూర్తి సినిమాలోకెళ్ళిపోతున్నా. సరే, మళ్ళీ కలుద్దాం.

Bhãskar Rãmarãju said...

@ అన్నగారు - ధన్యవాదాలు. తప్పకుండా అన్నగారు. మరి కిచెన్ స్టేడియం సిద్ధం చేస్కుందామా? :):)

సుజాత వేల్పూరి said...

అమ్మ లలిత గారూ, మర్చిపోలేదా మీరూ? కామెడీ మనుషులే మీరూనూ?
అమెరికాలో కోసుపువ్వుల్లో జీవాలుండవేమో మరి, అందుకే భాస్కర్ గారు గారు వాటిని మర్చిపోయారు. పైగా చెప్పినా సంఝవలేదంటున్నారు. మన స్టైల్లో మనం "ఉప్పు నీళ్లల్లో కాసేపుంచవలెను" అని జత చేసుకుందాం!


భాస్కర్ గారు,
పాపం లలిత గారు చెప్పింది ఆకుపచ్చగా మెత్తగా మీది మీదికి ఆప్యాయంగా పాకుతూ వచ్చే పురుగులగురించండీ!ఇక్కడ దాదాపు ప్రతి కాలిఫ్లవర్ తోనూ ఫ్రీగా లభిస్తాయి.

మీకు మంచు పడిందో లేదో మాకిక్కడ ఎండలు పేల్తున్నాయి. మీరు ఆ రెసిపీ రాయకపోతే పలనాడు పరువు తీస్తున్నారని డిఫమేషను సూటు వేసేస్తాను మీ మీద!(మా ఇంట్లో రెండో వాయ కూడా పెట్టేశాం)

సిరిసిరిమువ్వ said...

నా శ్రీమతికీ వందనం- ఈ మాటతో ఇంకా నచ్చారు మీరు. ఎంతమంది ఇలా మీలా ఆలోచిస్తారండి!

గా పండుమిరపకాయల పచ్చడి రెసిపీ ఏందో ఇక్కడ రైతుబజారులో పండుమిరపకాయల సీజను అయిపోంకముందే చెప్పెయ్యరాదా!

@సుజాత గారు, అమెరికాలో అవి ఆకుపచ్చగా వుండవేమో అందుకని అర్థం అయినట్లు లేదు! శ్రీ గారికి ఇచ్చిన సమాధానంలో వాటి గురించి ప్రస్తావించారు లేండి.

Venugopal Reddy Gurram said...

రామ్మోలక్కయని బాగానే గుర్తుపెట్టుకున్నారు....ఈ మధ్య ఒక తెలుగు గుంపుని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు....!

Bhãskar Rãmarãju said...

నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మాల్ విల్లేజ్, పికిల్ టేస్టింగ్స్ అర్రేంజ్డ్, ఐ వాంటెడ్ టు సీ ది పికిల్, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఫాదర్ మదర్ మై ఎగ్రీడ్, జార్(1) బిల్డ్. టూ వీక్స్ హ్యాపీ. థర్డ్ వీక్ స్టార్టెడ్ ట్రబుల్. వై? ల్యాంగ్వేజ్ ప్రాబ్లమా, ఎందుకు పండుమిరపకాయల కారం తిందాం అనుకుంటున్నావ్? ఐ కొసెన్, యూ ఆన్సర్
1 - జార్ = పచ్చళ్ల జాడి

Rani said...

ఎప్పటిలానే, సూపర్!!