Monday, March 16, 2009

On Demand (TM) పండుమిరపకాయల కారం

బ్లాగ్ మహిళామణులు, బ్లాగ్ వాగ్గేయకారులు, బ్లాగ్ శాస్త్రవేత్తలు, బ్లాగరులు, వాళ్లూ వీళ్లూ అందరూ -
అయ్యా, మరి ఎండా కాలం వచ్చేసింది. పండుమిరపకాయలు నవనవలాడుతూ కళ్లముందు కదులుతున్నాయ్. వాటితో, పఛ్చడి ఎలా చేయాలో చెప్పి మమ్మానందింపజేయి, రంజింపజేయి అని వ్యాఖ్యానించిని పిదప, సదరు వ్యాఖ్యలను శిరోధార్యంగా భావించి, ఆ ఎర్రని పండుమిరపాకయలని ఓ సారి స్వప్నముననే దర్శించుకుని, ఇక మొదలుపెడాదాం అని ఉద్యుక్తుణ్నౌతున్న నాకు, మా మాత దూరవాణిద్వారా, కుమారా, మోర్జంపాడు నుండి కాశయ్య ఇప్పుడే ఓ నాలుగు రధాల నిండా పండుపిరపకాయల పఛ్చడి ఇచ్చి వెళ్లాడు అని తెలియజేసింది. ఈ పఛ్చడి కోసం, మందుకొట్టకుండా, బాగా నీరుపెట్టి కోసిన పండుమిరపకాయలతో, కమ్మటి మామిడల్లం, గండ్ల ఉప్పు, మాంచి చింతపండుతో "రుబ్బింగు వెయ్యబడును" లో వేసి రుబ్బించి అందించి వెళ్లాడు అనే కమ్మని వార్తని విన్న నేను, అహా హతవిధి, ఇది కమ్మని వార్త ఎలా అవుతుంది, ఈ సప్త సముద్రాలు ఎలా ఒక్క దూకులో దాటి, ఇంటిపై వాలి, ఓ చేతితో ఆ సదరు రధాలని, వాటిని లాగుతున్న గుర్రాలనీ దొరకబుచ్చుకుని ఒక్క దూకుతో అమెరికాలో వాలిపోగలను? అని నన్ను నేను ప్రశ్నించుకుని, నోటియందూరిన లాలాజలమును ఇదియే ఆ పదార్ధమూ అని ఊహించుకుని, నాలుగు గుటకలు మింగి నిగ్రహించుకుని ఇలా ఈ ఉత్తరం రాస్తున్నాను.

త్వరలో మీ అందరి కోసం పండుమిరపకాయల కారం !!!
కానీ ముందు -
నైంటీన్ హండ్రెడ్ అండ్ యైటీఫైవ్!! మోర్జంపాడు, ఎ స్మాల్ విల్లేజ్, పికిల్ టేస్టింగ్స్ అర్రేంజ్డ్, ఐ వాంటెడ్ టు సీ ది పికిల్, నాట్ పాసిబుల్. ఓకే ఓకే ఫాదర్ మదర్ మై ఎగ్రీడ్, జార్(1) బిల్డ్. టూ వీక్స్ హ్యాపీ. థర్డ్ వీక్ స్టార్టెడ్ ట్రబుల్. వై? ల్యాంగ్వేజ్ ప్రాబ్లమా, ఎందుకు పండుమిరపకాయల కారం తిందాం అనుకుంటున్నావ్? ఐ కొసెన్, యూ ఆన్సర్.

1 - జార్ = పచ్చళ్ల జాడి

5 comments:

Rani said...

ఇలా ఊరగాయల పేర్లు చెప్పి ఊరించడం మహా పాపం. వచ్చే జన్మలో మీరు మిరపకాయ అయి పుట్టుదురుగాక!!

భాస్కర్ రామరాజు said...

రాస్తా రాణి గారు తొందర్లో...ఏంపర్లేదు, పల్నాడులో మిరపకాయలా పుట్టినా అదో ఇది. ఇక బుడ్డమిరపకాయ కధలు అప్పటికల్లా పాప్యులర్ అవుతాయ్ లేండి. FYI, In palnadu villages, granny and grandpas used to tell stories on "little green paper" portraying it as hero.

Rani said...

బుడ్డ మిరపకాయ కథలు కూడా మీరే రాసెయ్యండి, ఇక్కడ చదివి మా పాప కి చెప్తాను :)

భాస్కర్ రామరాజు said...

ఎన్నో ఆలోచనలు, మరెన్నో ఆవేశాలు, కానీ సమయం సరిపోవటంలేదు. మనల్ని మనం ఇలా కట్టేస్కుంటున్నామేమో అనిపిస్తుంటుంది ఈ అమెరికా, ఐ.టి వీటితో.
సాధించాల్సింది, సోధించాల్సింది, ముందు తరాలకి అందించాల్సింది ఎంతో ఉంది...
మీరు కూడా మీ వైపునుండి మన లెగసి కధలని ఎక్స్ప్లోర్ చెయ్యటం ప్రారంభించండి..

sri said...

ఎన్నాళ్ళో వేచిన ఉదయం, యేనాడూ కనపడదేమి ? అదేనండి, మీ పచ్చడి రెసిపీ కోసం వెయిటింగ్ అందరం ఇక్కడ !