ముందుగా దేంతోనో మొదలుపెట్టా కానీ, మొత్తం పెట్టా. అర్ధంకాలేదా??
మొన్న వారాంతానికి, తను పిల్లలతో సతమతమౌతుంటే, నేను రంగంలోకి దూకా. అసలు ఆలోచన, లేక నా మినిస్టరు యొక్క ఆర్డర్స్, తను ముందుగానే సోయా ఇంకేవో మొలకెత్తిన గింజల్ని ఉడ్కబెట్టింది, వాటితో కూరచెయ్యి అని. మనం మొదలుపెడుతుండగానే ఓ మెరుపు ఆలోచన వచ్చింది. మనోళ్లకి "తరగటం" మీద ఓ డెమో ఇస్తే వీడియో రూపంలో ఆనందిస్తారు కదా అని. ఠడా వెంటనే మన చిన్ని డిజిటల్ కెమెరా తెచ్చి ఎలానో కాఫీ పిల్టర్ మీద నిలబెట్టి మొదలెట్టా. అయితే ఈ వీడియోలో నెర్రేషన్ లేదు. ఆ సమయంలో మాట్టాడితే మావాడు వెంటనే యట్రాక్ట్ అయ్యి, నే తీస్తా వీడియో, నే తీస్తా వీడియో అని లాక్కెళ్లే ప్రమాదం ఉన్నందున, ఇది ఒకరకంగా "పుష్పక విమాణం" సినిమా లాంటిది అనుకోండి. అలా మొదలు పెట్టి, కూర విధి విధానంతో సహా లాగించేసా. అయితే, కొన్ని కొన్ని సాంకేతిక సమస్యలవల్ల నేననుకున్న విధంగా తీయలేకపొయ్యా. ఎలా అంటే, తరిగేటాప్పుడు ఒక కోణంలో పెట్టా కెమేరాని, అయ్యాక పందార డబ్బా మీద పెట్టా, బెమ్మాణంగా వస్తుంది అనుకున్నా, కానీ పందార డబ్బా మోసం చేసింది. భాండీ తప్ప అన్నీ పడ్డాయ్ వీడియోలో.
సరే సంగంతేంటంటే, చెప్పిందేచెప్పరా కాదు కాదు వినరా పాచిపళ్ళ దాసుడా. అనగా, మళ్లీ టమాటా కూరే.
ఐతే ఈ సారి వెరైటీగా -
టమాటా, బేబీమొక్కజొన్న, మొలకెత్తిన సోయా మరియూ ఇంకేదో గింజ. మొన్న మా లోకల్ కూరలషాపుకి వెళ్లినప్పుడు ఈ డబ్బా చూసా, మొలకెత్తిన సోయా+ఇవి. ఏంపర్లేదు కూరచేసి అవతల నూకచ్చు అని తీస్కున్నా.
ఒక మాట - అపరాలు అనగా, పెసలు, కందులు, శనగలు ఇలాంటివి. వీటిల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి తినటం మంచిది. ఇక్కడ మల్టై గ్రైన్స్ ఉన్న బ్రెడ్ అవి ఇవి దొరుకుతుంటాయ్ కూడా. మొలకెత్తినవి ఏవైనా సరే పిరికిడిలో పట్టినన్ని మాత్రమే తినాలి(హి హీ, ఎవ్వని పిరికిడీ అంటున్నావా!! నీదేనోయి నాగన్నా/నాగక్కా) ఎక్కువ తింటే "అతి సర్వత్రా.." తెలుసుగా.
ఈ కూరకి కావాల్సినవి -
టమాటాలు ఎరడు
ఒందు ఉల్లిపాయ
నాల్కు వెల్లుల్లి
నాల్కు మిర్చి
ఏళు బేబీమొక్కజొన్న
ఒందు మొలకెత్తిన ఇత్తనాల డబ్బా
ఒందు కొత్తిమీర కట్ట
నాల్కు చెంచాల నూనె. నేను ఈ మధ్య వంటలకి ఆలివ్ ఆయిల్ నూనె వాడుతున్నా.
ఇక మొదలుపెడదామా!!
ముందుగా ఆ మొలకెత్తిన విత్తనాలని ఉడ్కబెట్టుకో కొంచెం ఉప్పేసి.
పైన వీడియోకి నెర్రేషన్ -
వెల్లుల్లి రెబ్బల్ని కుక్కు, వాటిపై తొక్కలు తియ్యి. ఇక వాటిని సన్నగా తరుగు. పక్కకి పెట్టుకో. తర్వాత, అల్లం తొక్క తీస్కుని, సన్నగా తరుక్కో. అయ్యాక, బేబీమొక్కజొన్నలని నాలుగు భాగాలుగా తరుక్కో. ఇప్పుడు ఉల్లిపాయని నిలువుగా తరిగి, వాటిపైన తొక్కని తీసేసి నిలువుగా సన్నగా తరుగు. అయ్యాక, టమాటాలని శుభ్రంగా కడుక్కుని, సన్నగా తరుక్కో. ప్క్కనబెట్టు.
ఇప్పుడు, భాండీ తీస్కో, పొయ్యిమీదపెట్టు, వెలిగించు, నూనెపొయ్యి. తిరగమాట వెయ్యి. అయ్యాక మిర్చి, అల్లం, వెల్లుల్లి బేబీ మొక్కజొన్న ముక్కలు వేసేయ్, వేగినాక, కొంచెం పసుపు వెయ్యి. అయ్యాక, ఇప్పుడు ఉల్లిపాయలు వెయ్యి. వేయించు.
ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగుకి మారేలోపు, కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని, తరుక్కొ. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి మారినియేమో చూడు. మారితే టమాటాలు వేసేయ్యి, నేనైతే టమాటాలతోపాటు ఓ చెంచా టమాటా ప్యూరీ కూడా వేస్తా.
ఇప్పుడు, ఇందాకటి మొలకెత్తిన గింజలు వాటిని ఉడ్కబెట్టుకున్న నీళ్లతోబాటి వేసేసెయ్. చాలినన్ని నీళ్లు లేకపోటే ఓ అరగ్లాసు నీళ్లు మళ్లీ పోస్కోవచ్చు. ఓ సారి మొత్తం కలియతిప్పి, కావాల్సినంత ఉప్పు, కారం వేసి మూతబెట్టు. ఇందాక ఫైన్లీ ఛాప్ చేసిన కొత్తిమీర జల్లు, ఓ సారి కూరని మళ్లీ తిప్పి మూతపెట్టి సన్నని మంటపై అలా ఓ పావుగంట ఉంచు...
వేడివేడి కూరని లాగించు - అన్నంలో అయినా లేక రొట్టెల్లోకైనా ...
Monday, March 30, 2009
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
ఒక చిన్న సలహా.. కొత్తిమిర కాస్త కూర ఉడికేటప్పుడు కూడా వేయండి. ఘుమఘుమలాడిపోతుంది.
మీ కూర వాసనలు ఇక్కడికి కూడా వచ్చాయి. మావారి దాకా వెళ్లనివ్వలేదు. రేపు చేయమంటారు. ఎందుకొచ్చిన తంటా??
mee podcast lo updates aapesaru... 10 paatale vunnai....kastha daani vaipu choosi marinni paatalu pettagalaru....I love your collection which u updated ....thanks
ఎప్పుడూ అవే కూరగాయలు తింటుంటే
బోరు కొడుతుంది. ఈసారి ఈ కూర ట్రై
చేస్తాను. మంచి ఆరోగ్యకరమైన కూర
పరిచయం చేసినందుకు ధన్యవాదములు.
ఒక రేంజ్ లో తరిగేస్తున్నారుగా. ఫుడ్ చానెల్లో
చూసినప్పటినుండి ఇలా తరిగెయ్యాలని
ఒకటే ఆశ నాకు. అందుకని మీ కత్తిలాంటిదే
కొనుక్కున్నాను. రెండు సార్లు చెయ్యి తెగింది.
ఇంకా ప్రయత్నిస్తున్నాను.
annai... vedio download chesane.. mandi left handaaaaaa... aa kathenti brother evedinaina veejiga lepaiyochu dantoti..antha bhaimkaranga undi...
మీరు ప్రొఫెషనల్ చెఫ్స్ లాగా భలే తరిగేస్తున్నారు , చక చకా , భలే సన్నగా ... మాంచి చేయి తిరిగిన నలుడు, భీముడి లా ! అదీ అంత పెద్ద కత్తి తో ! నేను కూరలు తరగటం లో, మీతో పోటీ పడలేను బాబోయి ! వీడియో కి ధన్యవాదాలు !
జ్యోతి గారు, అలానే చేసా. :):)
విజయక్రాంతి - సమయం దొరుకుతల్లే.
భవాని - కత్తితో జాగ్రత్త.
శ్రీ గారు - ధన్యవాదాలు.
అనంతా - అవును తమ్మీ. ఎడమచేతి వాటం
Post a Comment