Thursday, July 23, 2009

ఓటు

ఏందీ!! నేను బ్లాగు ఎమ్మెల్యేగా పోటీసేత్తనా నాకోటేయండీ అని అడుగుత్తున్నా అనుకుంటన్నారా? మరక్కడే ఉప్మాలో చెంచా ఏసారు.
ఈయాల రోవంత ఆకలిగా ఉండింది. మరీమద్దెన డైటింగు గట్రా సేత్తనాం, ఎస్సర్సైజులు సేత్తాన్నాంగదా. అందుకు. మామూలుగైతే ఓ సంచి సిప్పీసు అ.క.అ చిప్సు కరకరా నములుకుంటా మిగేటోళ్ళం కదా. మరి ఇప్పుడేంసెయ్యాల్రా బగమంతుడా అని ఆలోసిస్తూ నా ఈప్మీనకేస్కునె సంచీలోకి సెయ్యి బెడితే, ల్యాపుటపు, బొక్కులు, కాయితకాలు, అయ్యి ఇయ్యి మట్టీ మషాణం, బయటి హార్డ్ డ్రైవ్, తోబాటు ఓటు మీల్ డబ్బా తగిలింది. జర్రున బైటికి గుంజునా . ఇట్టా ఓ సంచి తీసానా
From ఓట్మీల్

ఓ గలాసులో ఏడ్నీళ్ళు పోసినా
From ఓట్మీల్

సంచి చింపేసి ఏడినీళ్ళలో బోసినా
From ఓట్మీల్

ఓ రెంణ్ణిమిషాలు మూతబెట్టి ఉంచినా.
From ఓట్మీల్


ఓ సెంచా బెట్టి ఓ పాలి కలిపేసి సుబ్బనంగా లాగించినా!!!

11 comments:

Telugu Velugu said...

ha ha

do post your before ( exercising ) and after photos to inspire others too !

sunita said...

Good!!!Continue dieting like that.

పానీపూరి123 said...

> గలాసులో ఏడ్నీళ్ళు పోసినా
ఓలమ్మో ఓలమ్మో లబ్బరు గలాసులో ఏడ్నీళ్ళు ఎలా పోసినావు బిడ్డా?

పరిమళం said...

బ్లాగు ఎమ్మెల్యే గా పోటీ చేస్తే ఆడవారి ఓట్లతో పాటూ బ్రహ్మచారుల ఓట్లూ మీకే!

Money Purse said...

అరె ఎం జెప్పినవ్ భై ఈయాల రేపు అందరు గిట్లే డైటింగ్ జేస్సున్నరులే, నేను గూడ జిం కి పోవాలని అనుకుంటున్నా కాని ఎక్కడైతడి బై మనమంత బిజీ అన్నట్టు.
- పిల్ల బ్లాగర్
my new బ్లాగ్: http://alaa-jarigindandi.blogspot.com/

Bhãskar Rãmarãju said...

@ ఇన్ను -
తప్పకుండ, నేను కొన్ని మైలు రాళ్ళని చేరాలని పెట్టుకున్నా. అవి దాటాక తప్పక పెడతా
@ సునీత గారు - మీ ఆశీస్సులు. :):)
@ పానీపూరి - పల్లాస్టిక్కు గళాసు బాసూ. మరే!!
@ పరిమళం గారూ - మీరు మరీ అండీ...నాకు డిపాజిట్లు కూడా రావు.
@ నాగ - సమయం మనకి దొరకదు ఇప్పుడు, అది దొరికేప్పటికి మనకి తెల్లారుతుంది. తప్పదు, ఓ రెంణిమిషాలు పీకి, ఆరో-గ్యం మీన పెట్టాల్సిందే. తప్పదు బాసూ...తప్పదు.

madhu said...

http://health.usnews.com/usnews/health/healthday/080130/heating-plastic-bottles-releases-potentially-harmful-chemical.htm

ఆర్యా ! ఇది చదూకోండి !
కామట్టి, microwavable కప్పోక్కటి తెచ్చుకోండి ఆపీసుకి ! ఓట్లు శానా మంచియని ఇన్నా ! అందుకే రోవంత ఆకలేస్తే సాయంత్రాలు,మీ లాగే ఆవో లేక పళ్ళో తింటా ఉంటాను ! పళ్ళు పచ్చి కూరలు ( బీరకాయో, కారేట్టు లాంటివి ) తింటాను ! బరువు పెరగకుండా, ఆరోగ్యము భీ మన్చిగౌతది గందా !

madhu said...

పండు మిరప పచ్చడి ఇధానం చెప్తా,చెప్తా అని చెప్పనేలేదు ! అట్టే పప్పు ప్రియమైపోనాది కదా,పప్పు లేకుండా ఆకు కూరలు ఎట్టా వండచ్చో, చెప్పన్నా ! రోజూ ఆకు కూర తిననిదే మనకి తోచదు !

Bhãskar Rãmarãju said...

@ చందా - అరే భలే ఉందే మీ నిక్ నేం.
త్వరలో ఆకుకూరల్తో పప్పుకాకుండా కూరలపై కొన్ని టపాలు వేద్దాం లేడి, బెంగెట్టుకోకండేం.
పాండుపిరప - మర్సిపోతిని రామసెంద్రా!! ఏద్దాం ఇంకోటి...

madhu said...

@భాస్కర్ - నా నిక్నేమ్ మీకు నచ్చినందుకు హాప్పీసు ! :-) మీ పేరు చెప్పుకుని మళ్ళీ రుచిగా ఆకుకూరల కూరలు, ( నేను చేస్తే రుచిగా రావట్లేదు !) మిరప పచ్చడి తినొచ్చు అన్న మాట త్వరలో ! ధన్యవాద్ !

శిరీష said...

మీ తస్సరవ్వల మీ నోట్ల లడ్డు పెట్ట మీ దయటింగ్ పాదవను .......
చాల రోజులకి కళ్ళమ్మట నీల్లోచేల నవ్వా మీ బ్లాగు సూసి రచనే ఇంత రసవతరంగ ఉందంటే మిరెట్టే రసం ఐన కుమ్మేసమన్నమాటే
పచ్చని కూరల ప్రాప్తిరస్తు ............