Tuesday, September 1, 2009

కంది పచ్చడి

"నా పేరు లక్ష్మి! ఔనూ!! నీపేరేమిటి చెప్పుమూ?"
"నా పేరు గాంధీ, కేరాఫ్ ప్లాట్ఫారం"
"నువ్వూ నాలాగనే అన్నమాట!"
"ఆకలిగా ఉంది"
"ఇంద ఈ చెనక్కాయలు కుమ్ము"
కరకర - ఢమల్ ఢిమీల్
"అదేంటి గాంధీ అంత తీవ్రంగా సూస్తున్నావ్ ఆ పొట్లం కట్టిన కాయతకాన్నీ"
"ఇదేదో ఉద్యోగప్రకటనలా ఉంది లక్ష్మీ"
"ఏదీ చదువ్ "
"కావెలెను! ఓ పెద్ద హోటల్ లో వంటవాడు
అర్హతలు - ఓ పెద్ద ఎప్సెరీయన్స్ అవసరంలేదు. జీతమ్ గంటకి నాలుగు డాలర్లు"
"ఏంటీ? డన్కిన్ డోనట్స్ లో చేసిన గంటకి ఏడెనిమి వస్తాయ్. ఇదేదో కాళ్ళులాగే వ్యవహారమ్లా ఉందే"
"అంతే కాదు లక్ష్మీ వాళ్ళదే ఉంకో ప్రకటన
కావలెని! ఓ పెద్ద హోటల్ లో ఛీప్ షెఫ్
జీతం గంతకి పాతిక. ఓవర్ టైం ఎక్స్ట్రా. గ్రీన్ కార్డు ఉచితంగా చేయబడును."
"ఇందులో ఎదో తిరకాసు ఉంది గాంధీ. ఒకే రెస్టారెంటోడు ఇలా రెండు ఇచ్చాడంటే. నువ్వు తప్పనిసరిగా అప్ప్లై చెయ్యాల్సిందే."


... .. .


"హహహహ"
"ఏమిటమ్మా అంత ఇదిగా నవ్వుతున్నావ్"
"నువ్వు చెప్పింది కరెక్టు డాడీ"
"రెండో ఉద్యోగానికి వందల అప్లికేషన్లు వచ్చినై. మొదటిదానికి ఒకటె వచ్చింది. అదీ స్టాంపు లేకుండా"
"ఏమిఁటీ? ఈ రాజారామ్మోహన్ రావ్ కి స్టాంపులేకుండా అప్లికేషన్ పంపించడమా? ఎంత ధైర్యం? వాడిపేరేంటి?"
"గాంధీ"
"అపేరు పెట్టుకుని కూడా వాడికి అంతపొగరా. వాణ్ణి వెంటనే ఇన్టర్వ్యూ కిప్ ఇలువ్."

... .. .

"గుడ్మార్ణింగ్ సార్"
"హ్మ్! నువ్వేనా జాతిపితవి."
"కాదు సారు. కనీసం ఒట్టి పితని కూడా కాదు. ఎందుకంటే ఇంకా పెళ్ళు కూడా కాలేదు కాబట్టి. కొందరుమాత్రం ముద్దుగా బెంచ్ పిత అనిపిలుస్తుంటారు"
"హహహ"
"నువ్వు ప్రాక్టికల్ జోకులే కాకన్డా మామూలు జోకులు కోడా వెయ్యగలవన్నమాట. గుడ్. చూడబ్బాయ్!! జోకులువేసేవాళ్ళంటే నాకిస్టం, కానీ నామీదజోకులు వేసేవాళ్ళాంటేనే కష్టం. వాళ్ళంతేదో చూడకుండా నాకు నిద్రకూడా పట్టదు.
"ఆ!! ఇంటర్వ్యూ ప్రారంభిస్తాను.
మోదటి ప్రశ్న - నువ్వెక్కడుంటావ్."
"నాకంటూ ఇల్లులేదు. మా ఎంప్లాయర్ గాడి గెస్ట్ హౌస్ లో ఉంటా"
"ఓహో!! ఆ గెస్ట్ హౌస్ ఎక్కడుంది"
"వూరికి అటైపుంది"
"నువ్విక్కడకి ఎలా వచ్చావ్."
"(సచ్చినాడ ఎలా వస్తార్రా, నడ్సుకున్టా వచ్చా అనుకున్నావేట్రా) బస్సులో"
"లాస్ట్ అండ్ ఫైనల్ కొశ్చెన్ - ఎలా ఎలా ఎల్తావ్ నీ ఇంటికి అదే గెస్ట్ హౌస్ కి."
"(అదేమరి ఎకసెక్కాలన్టే) బస్సులో"
"దట్స్ ఆల్. నీ ఇంటర్వ్యూ ఐపోయింది. ఇంటర్వ్యూ కోసం ఇంతదూరం రావటం. ఈ ఇంటర్వ్యూకి వంటగదిలో గంటలు గుండిగలు గుండిగలు వండి ప్రాక్టీస్ చెయ్యటాలు శుద్ధ దండగ. యూ ఆర్ నాట్ సెలెక్టెడ్. దీన్నే టిట్ ఫర్ టాట్ అంటారు. తెలుగునుడికారంలో చెప్పాలంటే దెబ్బకు దెబ్బ. లేకపోతే ఈ రామ్మొహన్రావ్ కే ఉద్యోగానికి అప్ప్లికేషన్ పెడుతూ స్టాంప్ లేకుండా మెయిల్ చేస్తావా?"
"నేనూ మూడు ప్రశ్నలడగొచ్చా"
"అడుగు."
"మీ సంపాదన ఎంత?"
"గంటకి నాలుగొందలు."
"ఓహ్, అంటే ఎనిమిది గంటలకి (కాల్క్యులేటర్ పని చేయట్లా టయానికి దీనెన్కమ్మ) ఉండు, ఉండు, సెప్తా 3200, వారానికి 16000, నెలకి 64000 (మనసులో నాయల్ది, మనిషివా *త్తివా), అంటే నాకు నువ్వు ఇస్తానన్న జీతానికి వందరెట్లు ఎక్కువ. చూసావా, ఈ గంటకి నాలుగు డాలర్లు రాకుండా రాకుండా చేసానన్నమాట. ఎలా ఉంది సార్ ఈ టిట్ ఫర్ టాట్."
"ఇంతతెలివైన వాడివి ఈ ఉద్యోగానికే ఎందుకొచ్చావ్?"
"నాకన్నా రాటుదేలిన వంటగాళ్ళు మజ్జిగపుల్సు పెట్టుకుంటున్నారు సార్ ఇళ్ళల్లో."
"అలా ఎందుకు జరుగుతోంది."
"కందిపప్పు రేటుపెరగటం వల్ల."
"హా!! ఐతే కందిపచ్చడి చేయటం వచ్చానీకు."
"అదంతపెద్ద విషయమూకాదూ, అదోపెద్ద కష్టమూ కాదు."
"నువ్వు సరిగ్గా గమనించావో లేదో, నా చెవిలో పూలేంలేవు, నువ్వు చెప్పిందాతా వొప్పుకోటానికి. కందిపచ్చడి చెయ్యటం ఓ ఆర్ట్."
"గంటలో ఐదుగ్రాముల కందులతో కందిపచ్చాదిచేసు చూపిస్తా."
ఏంటీ గంటలో ఐదుగ్రాముల కందిపప్పుతో కందిపచ్చడి చేసిచూపిస్తావా, మర్డర్లు చేస్తావా లూటీలు చేస్తావా ఐదుగ్రాములు కొనాలంటే ఆస్థులు అమ్ముకోవాలి."
"రామ్మోహన్రావ్, నాలాంటి బెంచ్ పిత తల్చుకుంటే, ఇండియా నుండి వచ్చేప్పుడు తెచ్చుకున్న కిలోకందిపప్పు పొట్లం పగిలి చెల్లాచెదురుగా సూట్కేస్ లో పడిపోయిన గింజల్ని ఏరుకొచ్చైనా చేయాగలడు *కందిపచ్చడి*"
"అలాఐతే, నీకు నా రెస్టారెంట్లో ఉద్యోగమే కాకుండా గ్రీన్కార్డ్ కూడా ఉచితంగా ప్రాసెస్ చేయిస్తా"
... .. .

టిక్ టిక్ టిక్ కౌంట్ డౌన్ ఇస్టార్టెడ్ -

కావాల్సిన పదార్ధాలు: కందులు లేక కందిపప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి.
ముందుగా, కందిప్పప్పుని వేయించి పక్కనబెట్టుకోవాలి. ఎలా? భాండీ పెట్టి, భాండీ వేడయ్యాక కందిపప్పు వేసి వేపటమే.
టిక్ టిక్ టిక్ --
అయ్యాక, ఒక అరగ్లాసు నీళ్లలో ఓ పెద్ద గోలీ అంత చింతపండు నానబెట్టుకో. అలా అది నానుతూ ఉండనీ.
ఇప్పుడు, మళ్లీ భాండీ పెట్టు, ఓ రెండు చెంచాలు నూనె పొయ్యి. వేడి అయ్యాక, ఓ పావు గుప్పెడు జీలకర, ఓ ఎనిమిది మెంతులు వెయ్యి నూనెలో, వేగంగనే ఓ 10 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి, వేపు, అయ్యాక ఓ సిబ్బిరేకులో పోస్కో, లేకపోతే ఆ కోరుతో భయపడి మీ చుట్టుపక్కనోళ్లు అగ్నిమాపక యంత్రాన్ని పిలుస్తారు.
టిక్ టిక్ టిక్ --
ఇందాక చింతపండు నానబెట్టుకున్నావుగా, దాన్ని బాగా చెయ్యిపెట్టి పిసికి, చింతపండు పిప్పి తీసేయ్యి.
ఇప్పుడు, ఈ ఎండుమిరపగాయలు, ఏపిన కందిపప్పు, చింతపండు గుజ్జు, ఓ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బింగు వెయ్యి. అయ్యాక ఓ చెంచాడు ఉప్పువేసి మళ్లీ రుబ్బింగు వెయ్యి.
టిక్ టిక్ టిక్ --
రుబ్బింగు వెయ్యగా వచ్చిన పచ్చడినే కందిపప్పు పచ్చడి అంటారు.

రామ్మోహన్రావ్ ననేనేగెలిచా...
రామ్మోహన్రావ్....పారిపొయ్యాడు ఎదవ.

19 comments:

ఉమాశంకర్ said...

కంది పచ్చడికి ఇంత ఉపోద్ఘాతం :)

నిన్నరాత్రి ఛాలెంజ్ సినిమా వెయ్యిన్నొక్కోసారి చూసారాఏమిటి?

మంచు said...

Super..

శ్రీ said...

భలే రాసారు. చాలెంజ్ సినిమా రీల్ ని మళ్ళీ తిప్పారు. మీ ఉపోద్ఘాతం అంతా చదివి కంది పచ్చడి చదవలేదు --)

మా డెట్రాయిట్ కి వస్తున్నారా సెప్టెంబరులో ? మీరు చదవకపోయిఉంటే ఒక లుక్కేయండి http://detroittelugu.org/DTLC/Main.asp

నేస్తం said...

ఎప్పటి నుండో కందిపచ్చడి ఎలా చేయాలో అడుగుదాం అనుకుంటున్నా :) బాగా రాసారు ఈ రోజుకి వంట అయిపోయింది కాబట్టి రేపు ట్రయ్ చేస్తా :) అలాగే ఆ చేత్తో కంది పొడి గురించి రాస్తారని ఎదురుచూస్తూ ..

sunita said...

ఎంత సిరంజీవి ఏసీ, ఫానూ, పంకా ఐతే మాత్రం ఇంత పాత చింతకాయ పచ్చడితో కలిపి మరీ కంది పచ్చడి రెసిపీ ఇస్తారా?ఇదేదో బాగున్నట్లు లేదు అధ్యచ్చా!!

జ్యోతి said...

కందిపచ్చడి
http://shadruchulu.blogspot.com/2008/03/blog-post.html

కందిపొడి

http://shadruchulu.blogspot.com/2008/03/blog-post_28.html

Padmarpita said...

అయిదు గ్రాముల కందిపప్పుతో అదిరింది కందిపచ్చడి:):)

నేస్తం said...

jyOti gaaru చాలా థేంక్స్ అండీ :)

Sravya V said...

ఇంతకీ చాలెంజ్ సినిమా కి కంది పచ్చడి ఫ్రీ నా లేకపొతే కంది పచ్చడి కి చాలెంజ్ సినిమా ఫ్రీ నా?

పరిమళం said...

యండమూరిగార్ని మరిపించేలా ఉంది మీ టపా !
మొత్తానికి కందిపచ్చడి నేనూ ట్రై చేశా ..సక్సెస్ అయ్యా ! చాలెంజ్ లో గెలిచా !

Kathi Mahesh Kumar said...

అదిరింది.

Sravya V said...

భాస్కర్ గారు ఏమి ఈ మాయ ? ఈవాళ ఏమిటి ఈ షాకులు ? :)

Bhãskar Rãmarãju said...

కలి ప్రభావం!!
:):)

wondergirl said...

baagundi

madhu said...

>>వేగంగనే ఓ 10 తొడిమలు తీసిన ఏండుమిరపగాయలు వెయ్యి,

5gms కందిపప్పుకి, పది మిరపకాయలా ? :-P

jokes apart, ఎంత కందిపప్పుకి పది మిరగాయలో చెప్పి పుణ్యం కట్టుకోండి.ఇలా కందిపప్పు రేటు పెరిగిన సమయంలో, కంది పచ్చడి రెసిపీనా ?

నవ్వలేక చచ్చాను ఆ ఛాలెంజ్ ఉపోద్ఘాతం చదివి .బాగా రాసారు.
షాకులు కూడా అదిరిపోయాయి !

Sravya V said...

15 రోజుల నుంచి కందిపచ్చడి తిని తిని బోర్ కొడుతుంది , కొత్తది రాయండి సారూ !

lakshmi sravanthi udali said...

http://sravanthivantaillu.blogspot.com/
naa blog ni kudaa okka sari chudandi naanna

సుజ్జి said...

కేకలు పెట్టిస్తున్నారు గా .. :)

suma said...

antha baagane undi... but Kandi pappu quantity antho mention cheyaledu.... cheppi kandi pachadi tine avakasem kalpinchandi