Tuesday, August 2, 2011

జొన్న బువ్వ + గోంగోర పప్పు

నిన్న రేత్తిరి జొన్నబువ్వ గోంగోరపప్పుతో కుమ్మినా
పెపంచికం ఇట్టా మారకముందటి రోజుల్లో జొన్నబువ్వే బువ్వ. జొన్నకూడ తింటం వొళ్ళు అలసిందాంక పనిసేయ్టం, రేత్తిరికి సీకెటేళకల్లా సల్లబువ్వ తింటం నిద్దరోటం మడిసికి అలవాటు. ఆరోజుల్లో ఇళ్ళలోనే పేద్ద రోలు రోకలి ఉండేవి అందరికీ. జొన్నలు రోట్లోఏసి తొక్కి, ఎసట్లో ఏసి ఉడకంగనే ఏడేడిగా తింటం అనేదే రీతి.
ఇయ్యాల వరిబువ్వే బువ్వ, తెల్ల బియ్యం తీపెక్కువ. ఎవుడిక్కావాల పాత ఇదానాలు. అంతా యంత్రం మాయ. తెల్లోడి మాయ. ఎర్రోడి మాయ. నల్లోడి మాయ.
ఏలం ఎర్రి....
కొత్తకి ఇంత పాతకి రోత అని ముతక సామెతలే.
నులకమంచం వారమ్మటి వార్చుకుని ఓ సుట్టపీకి ముసుగుతన్ని నిద్దరపోవాల ఇంక.
ఉంటా

7 comments:

Sandeep P said...

బాగుంది భాస్కర్ గారు. జొన్న ని ఆంగ్లంలో ఏమంటారు? అది అమెరికాలో దొరుకుతుందా? గోంగూర దొరుకుతుందా?

Bhãskar Rãmarãju said...

జొన్నని ఆంగ్లంలో సొర్గం అంటారు
http://en.wikipedia.org/wiki/Sorghum
అమెరికాలో కూడా జొన్న పండిస్తారు. కానీ తక్కువ. దేశీ దుకాణాల్లో జొన్నలు దొరుకుతాయి, జొన్న పిండి దొరుకుతుంది.
ఇక గోంగూర!
ఓ కుండీలో పది విత్తనాలు జల్లాము. మూర పొడుగు గోగికాడలు వచ్చాయి. అప్పుడు రెండు ఇప్పుడు రెండు దూసి ఇదిగో ఇలా పప్పు వండుకుంటుంటాము. దేశీ దుకాణాల్లో సీజనులో గోంగోర దొరుకుతుంది కూడా.

చిలమకూరు విజయమోహన్ said...

సోర్గం నిజంగా సొర్గమే సోదరా!చేన్లలోకి సద్దికూడు గంప కూలీలకు తీసుకెళ్ళేటప్పుడు దానివెంటబోయి కూలీలతో పాటు జొన్నముద్ద తినేవాణ్ణి.నీకేమి ఖర్మ నాయనా ఇంట్లో వరిబువ్వ తినకుండా ఈడకొచ్చి జొన్నముద్ద తింటావు అనేవాళ్ళు.అట్లాగే కొర్రబువ్వ చారుతో కలిపి తింటావుంటే ఉంటుంది నా సామిరంగా.
మీ టపా ఆనందకరమైన,ఆరోగ్యకరమైన రోజులను గుర్తుకు తెచ్చింది.

Chari Dingari said...

The U.S. exports almost half of the sorghum it produces and controls 70% to 80% of world sorghum exports.

http://www.epa.gov/agriculture/ag101/cropmajor.html

Bhasker garu, jonnalu ela process chesi buvva vandaalo chebutaaraa?

Sravya V said...

మొత్తానికి 9 నెలల తరవాత ఒక పోస్టు పడింది ఈ బ్లాగులో :)))
నులకమంచం వారమ్మటి వార్చుకుని ఓ సుట్టపీకి ముసుగుతన్ని నిద్దరపోవాల ఇంక.
--------------------------------------------------
హ హ :)))

Bhãskar Rãmarãju said...

జొన్న కలి జొన్న యంబ
జొన్నన్నము జొన్న పిసరు జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ బల్నాటి సీమ ప్రజలందరకున్

sunita said...

hmmm...ilaanTi post la koesamae choostunnaamu:) Agree with Sravya gaaru.